dachepalli: దాచేపల్లి ఘటన బాధాకరం : ఏపీ మంత్రులు

  • బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు
  • ఈ ఘటనను రాజకీయం చేయాలని కొందరు చూస్తున్నారు
  • నిందితుడిని పట్టుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తాం 

దాచేపల్లిలో తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటనను రాజకీయం చేయాలని కొందరు చూస్తుండటం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, దాచేపల్లి ఘటన బాధాకరమని, చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, నిందితుడిని పట్టుకుని ఫోక్సో చట్టం అమలు చేస్తామని అన్నారు.

dachepalli
anandbabu
  • Loading...

More Telugu News