love: ప్రేమ వివాహాలు చేసుకునే వారిని.. బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న గ్రామం!

  • పంజాబ్‌లోని లుథియానా జిల్లాలో ఘటన
  • చాంకోయిన్‌ ఖుర్ద్‌ గ్రామంలో ఇటీవల కులాంతర వివాహం
  • అటువంటి వారితో మాట్లాడకూడదని నిర్ణయం

ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే వారిని గ్రామం నుంచి బహిష్కరించేందుకు పంజాబ్‌లోని లుథియానా జిల్లా చాంకోయిన్‌ ఖుర్ద్‌ అనే గ్రామంలో పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న జంటలపై సామాజిక బహిష్కరణ వేటు వేస్తామని, అలాగే వారితో ఎవరూ మాట్లాడకూడదని పంచాయతీ సభ్యుడు ప్రకటన చేశాడు. దీనికి ఊరు మొత్తం కట్టుబడి ఉండాలని నిర్ణయించుకుంది.

ఊరిలోని వారు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది. గత నెల 29న ఓ జంట కులాంతర వివాహం చేసుకోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు చేసుకుంటోన్న ఘటనలపై గ్రామ పంచాయతీలో చర్చించి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఇటువంటి చర్యలు సరైనవి కావని, ఒక వేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిని బహిష్కరిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలోనూ పలు గ్రామాల్లో పంచాయతి పెద్దలు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటువంటి నిర్ణయాలు, తీర్పులు చట్టబద్ధంగా చెల్లవని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News