c ramachandraiah: చంద్రబాబు లీకులు మాత్రమే ఇస్తారు.. ఆయన వల్ల బీజేపీ నాశనమైంది: సి.రామచంద్రయ్య

  • చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయలేరు
  • ఏదో ఒక కూటమి ద్వారానే అధికారంలోకి వచ్చారు
  • ప్రజల సొమ్ముతో దీక్షలు చేయడం ఏమిటి?

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం చంద్రబాబుకు అలవాటని... ఆయన ఒంటరిగాపోటీ చేయలేరని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. ఏదో ఒక కూటమి ద్వారానే ఆయన అధికారంలోకి వస్తున్నారని చెప్పారు. 2019 ఎన్నికలలో రాజకీయ లబ్ధి కోసం బీజేపీని బూచిగా చూపిస్తున్నారని... చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న కారణంగా బీజేపీ బలైందని అన్నారు.

తన వ్యక్తిగత వైఫల్యాలను పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు. ప్రజల సొమ్ముతో చంద్రబాబు దీక్షలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు లీకులు మాత్రమే ఇస్తారని, ఏ విషయాన్ని నేరుగా చెప్పరని అన్నారు. 

c ramachandraiah
Chandrababu
BJP
  • Loading...

More Telugu News