charan: చరణ్ కోరిక మేరకే బోయపాటి మూవీలో శ్రీకాంత్

  • బోయపాటితో చరణ్ మూవీ 
  • కథానాయికగా కైరా అద్వాని 
  • ముఖ్యమైన పాత్రలో శ్రీకాంత్    

చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట .. ఆ పాత్రను ఒక సీనియర్ హీరోతో చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బోయపాటి వ్యక్తం చేశారట.

 అయితే ఆ పాత్రకి శ్రీకాంత్ ను తీసుకుందామని చరణ్ పట్టుబట్టడంతో బోయపాటి ఓకే అనేశారని తెలుస్తోంది. గతంలో 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో చరణ్ బాబాయ్ గా శ్రీకాంత్ నటించాడు. మళ్లీ ఈ సినిమాతో వీళ్ల కాంబినేషన్ తెరపై సందడి చేయనుందని అంటున్నారు. త్వరలోనే శ్రీకాంత్ ఈ సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడని చెబుతున్నారు. తొలి సినిమా అయిన 'భరత్ అనే నేను'తో భారీ హిట్ కొట్టేసిన కైరా అద్వాని, ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండటం విశేషం.      

  • Loading...

More Telugu News