rahul gandhi: రాహుల్ వయసెంత.. మీ వయసెంత.. సిగ్గుగా లేదా, మోదీ గారూ?: ప్రకాష్ రాజ్

  • 2019 తర్వాత మోదీకి పనేం ఉండదు
  • కర్ణాటక వస్తే మా వాళ్లు కన్నడ నేర్పిస్తారు
  • మోదీ పతనం కర్ణాటక నుంచే ప్రారంభమవుతుంది

ప్రధాని మోదీ ప్రతాపం ఎంత అనేది ఈ నెల 15వ తేదీన వెలువడే కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తేలిపోతుందని సినీ నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. కర్ణాటక నుంచే బీజేపీ పతనం ప్రారంభం కాబోతోందని చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత మన దేశంలో మోదీకి పనేం ఉండదని... కర్ణాటకకు వచ్చేస్తే మా వాళ్లు కూర్చోబెట్టి కన్నడ భాష నేర్పిస్తారని అన్నారు.

కర్ణాటక ప్రచారంలో మోదీ కన్నడ ప్రసంగాన్ని ఎద్దేవా చేస్తూ, ప్రకాష్ రాజ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. సింధనూరులో దళిత, ప్రగతిపర సంఘాలు ఏర్పాటు చేసిన 'ప్రజాస్వామ్య రక్షణ కోసం' అనే కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కన్నడలో మాట్లాడిన ప్రసంగాన్ని అనుకరించి చూపారు. కాయగూరలు అమ్మినట్టు ఏమిటండీ ఈ భాష? అంటూ ఎద్దేవా చేశారు.

మరోవైపు రాహుల్ గాంధీ ప్రసంగాలను తప్పుబడుతున్న మోదీని ఉద్దేశించి... రాహుల్ వయసెంత? మీ వయసెంత? సిగ్గుగా లేదా? అని అన్నారు. తాను ఏ పార్టీ వ్యక్తిని కాదని... బీజేపీ అంటే తనకు భయం లేదని చెప్పారు. 

rahul gandhi
Narendra Modi
Prakash Raj
karnataka
elections
  • Loading...

More Telugu News