sharwanand: శర్వానంద్ కోసం భారీ సెట్ .. యాక్షన్ సీన్స్ చిత్రీకరణ

  • సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ 
  • యాక్షన్ ప్రధానంగా సాగే కథ 
  • కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్    

ఒక వైపున హను రాఘవపూడి దర్శకత్వంలోను .. మరో వైపున సుధీర్ వర్మ దర్శకత్వంలోను శర్వానంద్ సినిమాలు చేస్తున్నాడు. హను రాఘవపూడి సినిమాకి 'పడి పడి లేచే మనసు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక సుధీర్ వర్మతో చేస్తోన్న సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. యాక్షన్ పాళ్లు ఎక్కువగా వుండే ఈ సినిమా కోసం హైదరాబాద్ లో ఒక భారీ సెట్ వేశారు.

ఈ నెల 15వ తేదీ వరకూ ఈ సెట్ లో యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారు. ఈ ఫైట్ సీన్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్ కి చెందినవే. అందువలన ఇవి తనకి తప్పకుండా సక్సెస్ ను తెచ్చిపెడతాయనే నమ్మకంతో శర్వానంద్ వున్నాడు. 

sharwanand
kalyani
  • Loading...

More Telugu News