vijay: షూటింగ్ అయ్యాక ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి వెళ్లమన్న యువకులు .. సారీ చెప్పిన విజయ్!

  • చెన్నై బీచ్ లో సినిమా షూటింగ్స్ 
  • అందువలన ఏర్పడిన చెత్తా చెదారం 
  • శుభ్రం చేసి వెళ్లమంటూ ఆగ్రహం

చెన్నై 'కోవలం' బీచ్ ను శుభ్రంగా ఉంచడంలో స్థానిక సర్ఫింగ్ క్రీడాకారులు ప్రధానమైన పాత్రను పోషిస్తున్నారు. 40 మంది సర్ఫింగ్ క్రీడాకారులు వాలంటీర్లుగా ఏర్పడి, ఎప్పటికప్పుడు బీచ్ ను శుభ్రం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆ బీచ్ లో విజయ్ .. మురుగదాస్ ల సినిమాతో పాటు, మణిరత్నం మూవీ 'చెక్క చివంతా వానం' సినిమా షూటింగ్ కూడా జరిగింది.

ఈ రెండు సినిమాల షూటింగ్స్ కారణంగా ఆ బీచ్ లో విరిగిపోయిన వస్తువులు .. పగిలిపోయిన గాజు ముక్కలు .. చెత్తా చెదారం పడ్డాయి. వాటిని అక్కడ అలాగే వదిలేసి ఎవరికివాళ్లు బయల్దేరుతున్నారట. అది గమనించిన సర్ఫింగ్ క్రీడాకారులు, ఈ సినిమా టీమ్స్ ను అడ్డుకున్నారు. బీచ్ ను శుభ్రం చేసిన తరువాతనే అక్కడి నుంచి వెళ్లాలని చెప్పడంతో అలాగే చేశారట. ఈ విషయంపై హీరో విజయ్ స్పందిస్తూ ఫేస్ బుక్ ద్వారా సారీ చెప్పగా .. అలాగే మణిరత్నం మద్రాస్ టాకీస్ ప్రతినిధి కూడా పొరపాటు జరిగిందంటూ స్పందించారు.  

  • Loading...

More Telugu News