Dev: పవన్ కల్యాణ్ వ్యూహకర్త దేవ్... బీజేపీ కార్యకర్తే!

  • జనసేన వ్యూహకర్తగా దేవ్
  • ఈ దేవ్ ఖైరతాబాద్ చింతల్ బస్తీ వాసి
  • అసలుపేరు వాసుదేవ్, బీజేపీ కార్యకర్త
  • సోషల్ మీడియాలో పాత వీడియోలు వెల్లువ

జనసేన అనుబంధ విభాగమైన 'ఏసీఎఫ్'లో సభ్యులుగా ఉన్న 1200 మందిని సమన్వయం చేసుకుంటూ, తనకు రాజకీయ వ్యూహకర్తగా దేవ్ అనే వ్యక్తిని పవన్ కల్యాణ్ నియమించుకున్న నేపథ్యంలో ఈ దేవ్ ఎవరంటూ వెతికిన వారు పలు కొత్త విషయాలను బయటకు తెస్తున్నారు. ఈ దేవ్ బీజేపీ కార్యకర్తని చెబుతూ కొన్ని వీడియోలు, పోస్టర్లు, ప్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇతని అసలు పేరు వాసుదేవ్ కాగా, గతంలో తనను తాను బీజేపీ నేతగా పరిచయం చేసుకుంటూ ముద్రించిన పోస్టర్లు, ప్లెక్సీలు ఇప్పుడు బయటకు తెచ్చారు నెటిజన్లు.

ఇక పవన్ తో మీడియా సమావేశం వేళ, తనకు తెలుగు అంతగా రాదన్నట్టు మాట్లాడుతూ, ఆంగ్లంలోనే మీడియావారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన దేవ్, అనర్గళంగా తెలుగులో మాట్లాడుతున్న వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్న ఓ సభలో దేవ్ మాట్లాడుతున్న వీడియోలూ ఉన్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్ పరిధిలోని చింతలబస్తీ నివాసి వాసుదేవ్ అని, బీజేపీ తరఫున పని చేశారని తెలుస్తోంది.

ఇక దేవ్ ను జనసేన ఆఫీసులో చూసిన బీజేపీ నేతలే ఆశ్చర్యపోయారట. నిన్న మొన్నటి వరకూ తమ తరఫున పనిచేసి, ఎప్పుడు జనసేన వ్యూహకర్తగా ఆయన మారిపోయారో తెలియడం లేదని ఆ పార్టీ నేతలు అంటుండటం గమనార్హం.

  • Error fetching data: Network response was not ok

More Telugu News