Priya Varrier: తన హీరోతో కలసి తీసుకున్న ఫొటో పోస్ట్ చేసిన ప్రియా వారియర్... 'వావ్' అంటున్న నెటిజన్లు!

  • సోషల్ మీడియా పుణ్యమాని రాత్రికి రాత్రే స్టార్ అయిన ప్రియ
  • మాలీవుడ్ ఫొటోగ్రాఫర్ అజ్మల్ ఆధ్వర్యంలో ఫొటో సెషన్
  • ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ప్రియా వారియర్

ఒక్కసారి కన్నుకొట్టి, సోషల్ మీడియా పుణ్యమాని రాత్రికి రాత్రే స్టార్ డమ్ తెచ్చుకున్న మలయాళ భామ ప్రియా వారియర్, తన తాజా చిత్ర హీరో రోషన్ అబ్దుల్ రహూఫ్ తో కలసి తీయించుకున్న ఫొటోను అభిమానులతో పంచుకోగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. "ఒరు ఆధార్ లవ్" చిత్రంలో వీరిద్దరూ కలసి జంటగా నటించిన సంగతి తెలిసిందే.

కళ్లతోనే నటించి, మెప్పించే శక్తి అటు ప్రియకు, ఇటు రోషన్ కూ ఉంది. ఇక ప్రముఖ మాలీవుడ్ ఫొటోగ్రాఫర్ అజ్మల్ లతీఫ్ వీరిద్దరి ఫోటోలు తీయగా, ప్రియ వాటిని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ ఫొటో చూస్తున్న వారంతా 'వావ్' అంటున్నారు.

Priya Varrier
Roshan Abdul
Malayalam
Movie
Social Media
  • Loading...

More Telugu News