Donald Trump: నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ ను నామినేట్ చేసిన రిపబ్లికన్లు

  • శాంతి బహుమతికి ట్రంపే అర్హుడన్న దక్షిణకొరియా అధ్యక్షుడు
  • ఉత్తరకొరియాతో శాంతినే కోరుకుంటున్నానన్న ట్రంప్
  • ఇప్పటి వరకు పీస్ ప్రైజ్ ను అందుకున్న నలుగురు యూఎస్ అధ్యక్షులు

అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఆయన పార్టీ అయిన రిపబ్లికన్ నేతలు నామినేట్ చేశారు. దీంతో, ప్రపంచ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. మరోవైపు, ఇటీవల మిచిగాన్ లో ఓ ర్యాలీకి హాజరైన ట్రంప్ ను ఉద్దేశించి ఆయన అభిమానులు 'నోబెల్... నోబెల్' అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంతో ఆనందానికి గురైన ట్రంప్... తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించానని నవ్వుతూ చెప్పారు.

మరోవైపు, నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంపే అర్హుడు అంటూ దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించారు. ఉత్తర కొరియాతో తాను శాంతినే కోరుకుంటున్నానని చెప్పారు. ఇప్పటి వరకు నలుగురు అమెరికా అధ్యక్షులు నోబెల్ శాంతి బహుమతిని అందుకోగా... వారిలో థియోడర్ రూజ్ వెల్ట్, ఉడ్రో విల్సన్, జిమ్మి కార్టర్, బరాక్ ఒబామాలు ఉన్నారు.

  • Loading...

More Telugu News