Telugudesam: బీజేపీలో చేరతారన్న ప్రచారంపై సుజనా చౌదరి స్పందనిది!

  • తెలుగుదేశం పార్టీని వీడబోను
  • ఏ నిర్ణయం తీసుకున్నా అధినేత ఆదేశాల మేరకే
  • కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి

తాను బీజేపీలో చేరనున్నట్టు వచ్చిన వార్తలపై కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి స్పందించారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, ఇవన్నీ వదంతులేనని, తాను తెలుగుదేశం పార్టీని వీడబోవడం లేదని స్పష్టం చేశారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా అధినేత ఆదేశాల మేరకే తీసుకున్నానని, కేంద్రం నుంచి బయటకు వచ్చేద్దామని తాను జనవరిలోనే చెప్పానని అన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు ఎంతో కృషి చేశానని చెప్పారు.

ఒకసారి ఎన్నికలు ముగిసిన తరువాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉంటాయని, అభివృద్ధి పనుల విషయమై రెండు ప్రభుత్వాల మధ్య చర్చలుంటాయే తప్ప, బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య కాదని వ్యాఖ్యానించారు. తాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెళ్లి, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడానని అన్నారు. తానేమీ ప్రభుత్వంతో వ్యాపారాలు చేయలేదని, తన తండ్రి ముఖ్యమంత్రి కాదని, విపక్ష నాయకుడి మాదిరిగా వారం వారం కేసుల విచారణకు హాజరు కావడం లేదని అన్నారు.

ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక నేరాలు వేరని, రుణాలు తీసుకుని ఇబ్బందులు వచ్చి, తిరిగి చెల్లింపుల్లో ఆలస్యం అయినంత మాత్రాన నేరం చేసినట్టు కాదని అన్నారు. కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ రావచ్చని అంచనా వేశారు.

Telugudesam
Sujana Chowdary
BJP
  • Error fetching data: Network response was not ok

More Telugu News