Andhra Pradesh: నేటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు.. అత్యవసర కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్‌లు

  • తిరిగి జూన్ 2న తెరుచుకోనున్న హైకోర్టు
  • అత్యవసర కేసుల విచారణకు రెండు వెకేషన్ బెంచ్‌లు
  • ఈనెల 10, 17, 22, 31 తేదీల్లో కేసుల విచారణ

హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. నేటి నుంచి జూన్ 1 వరకు హైకోర్టు తలుపులు మూతపడనున్నాయి. అయితే, అత్యవసర కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా బెంచ్‌లు ఏర్పాటు చేశారు. మే 10, 17 తేదీల్లో అత్యవసర కేసుల విచారణను మొదటి వెకేషన్ బెంచ్‌లో జస్టిస్‌ దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలితో కూడిన డివిజన్‌ బెంచ్‌, జస్టిస్‌ సునీల్‌ చౌదరితో కూడిన సింగిల్‌ బెంచ్‌ విచారణ చేపడతాయి.

మే 22న రెండో వెకేషన్ బెంచ్‌లోని జస్టిస్‌ ఎస్వీ భట్‌, జస్టిస్‌ ఉమాదేవితో కూడిన ధర్మాసనం, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌తో కూడిన సింగిల్‌ బెంచి విచారణ చేపడతాయి. మే 31న జస్టిస్‌ ఎస్వీ భట్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌తో కూడిన ధర్మాసనం, జస్టిస్‌ శంకరనారాయణతో కూడిన సింగిల్‌ బెంచ్ విచారణ చేపడతాయి.

Andhra Pradesh
Telangana
High Court
Summer
Holidays
  • Loading...

More Telugu News