BJP: అది మోదీ, అమిత్ షా కోరిక.. అందుకే విడివిడిగా ప్రచారం!: యడ్యూరప్ప

  • రెండు రోజుల్లో ఆరు నియోజకవర్గాల్లో పర్యటన
  • త్వరలోనే అన్నింటిలోనూ పూర్తి
  • బీజేపీకి ‘గాలి’ సోదరుల అవసరం చాలా ఉంది

కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రచారం ఊపందుకుంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అయితే, వీరి సభల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ఇది పలు అనుమానాలకు కూడా తావివ్వడంతో యెడ్డీ అసలు విషయాన్ని వెల్లడించారు.

అందరం కలిసి కాకుండా వేర్వేరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నది మోదీ, అమిత్ షాల కోరికని పేర్కొన్నారు. అందుకనే వేరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. గత రెండు రోజుల్లో ఆరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించామని తెలిపారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారం పూర్తి చేస్తామన్నారు. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సోదరుల అవసరం బీజేపీకి ఎంతో ఉందని యడ్యూరప్ప తెలిపారు. ఈనెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 15న ఫలితాలు వెల్లడికానున్నాయి.

BJP
Narendra Modi
Amit shah
Karnataka
yeddyurappa
  • Loading...

More Telugu News