Chandrababu: ఏపీ మంత్రి వర్గ భేటీలో కీలక నిర్ణయాలు

  • రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ కార్యాలయం ఏర్పాటుకు 2 వేల గజాలు
  • పీపీపీతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి
  • కొత్త పీఆర్‌సీ ఏర్పాటుకు ఆమోదం
  • వివిధ సంస్థలు, కార్యాలయాలకు భూముల కేటాయింపు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇందులో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ కార్యాలయం ఏర్పాటుకు 2 వేల గజాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పీపీపీతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి ఆమోదం తెలిపారు. బందరు పోర్టుకు రైల్వే కనెక్టివిటీ కోసం ఇన్‌క్యాప్‌కు 1092 కోట్ల రుణాల గ్యారెంటీకి నిర్ణయం తీసుకున్నారు.

ఇతర నిర్ణయాలు..
  • కొత్త పీఆర్‌సీ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం
  • ఏపీ కంపల్సరీ రిజిస్ట్రేషన్‌ ఆఫ్ మ్యారేజెస్‌ యాక్ట్‌-2002కు సవరణల ఆర్డినెన్స్‌కు ఆమోదం
  • చంద్రన్న పెళ్లి కానుకలో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తూ ఆర్డినెన్స్‌కు రూపకల్పన
  • వివిధ వర్గాలకు ఒకే ప్లాట్‌ఫామ్‌ ద్వారా కానుక అందించేందుకు ఆర్డినెన్స్‌కు రూపకల్పన
  • సీఆర్‌డీఏలో వివిధ సంస్థలు, కార్యాలయాలకు 51.92 ఎకరాల కేటాయింపునకు ఆమోదం
  • సీబీఐ, ఫోరెన్సిక్ ల్యాబ్‌ ల కోసం రెండు ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం
  • మరో 19 జాతీయ సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్‌సిగ్నల్‌

  • Loading...

More Telugu News