Samamta: సమంత పోటీకి భారీగా స్పందన.. 'అహ నా పెళ్లంట' అంటూ డ్యాన్స్‌ చేస్తోన్న అమ్మాయిలు

  • కొందరి డ్యాన్స్‌ వీడియోలను రీట్వీట్‌ చేసిన సమంత
  • లవ్లీ అంటూ చప్పట్లు కొట్టిన శామ్‌
  • 'అహనా పెళ్లంట' డ్యాన్స్‌ చేస్తూ పోటీ పడుతోన్న అమ్మాయిలు

అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా 'మహానటి' సినిమా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో 'మాయా బజార్‌'లోని ‘అహ నా పెళ్లంట.. ఓహో నా పెళ్లంట’ పాటకు తమదైన శైలిలో నృత్యం చేస్తే వారిలో బాగా అనిపించిన కొందరికి గిఫ్ట్‌లు ఇస్తానని హీరోయిన్‌ సమంత ఇటీవల ట్విట్టర్‌లో ప్రకటించింది.

వైజయంతి మూవీస్‌ వారి మహానటి ఫన్ ఛాలెంజ్‌ పేరిట మొదలైన ఈ పోటీకి మంచి స్పందన వస్తోంది. చాలా మంది అమ్మాయిలు ‘అహ నా పెళ్లంట.. ఓహో నా పెళ్లంట’ పాటకు డ్యాన్స్‌ చేస్తూ ఆ వీడియోలను తీసి #celebrateSavitri ట్యాగ్‌చేసి ట్విట్టర్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. వాటిల్లో కొందరు చిన్నారులు చేసిన డ్యాన్స్‌ లు సమంతకి బాగా నచ్చాయి. వారి డ్యాన్స్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. లవ్లీ అంటూ కామెంట్ చేసి చప్పట్లు కొట్టింది.  

Samamta
savitri
mahanati
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News