jagan: 10 జన్ పథ్ లో నిటారుగా నిలబడ్డ నేత జగన్: భూమన

  • టీడీపీ గోడలు బద్దలు కొట్టే ధీరుడు జగన్
  • వైయస్ ఆలోచనలే వైసీపీ సిద్ధాంతాలు
  • రాజకీయం అంటే అధికారం అనేది చంద్రబాబు సిద్ధాంతం

అధికారం ఒకరు వేస్తే తీసుకునే భిక్ష కాదని, పోరాడి సాధించుకునే హక్కు అని చెప్పిన నాయకుడు జగన్ అని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం కాకుండా, తండ్రి ఆశయ సాధన కోసం జగన్ పోరాటం చేస్తున్నారని చెప్పారు. 10 జన్ పథ్ లో నిటారుగా నిల్చున్న వ్యక్తి జగన్ అని... ఆయనను కుంగదీయాలని వందసార్లు ప్రయత్నించినా లొంగలేదని అన్నారు.

జగన్ లాంటి గొప్ప నాయకుడికి చేదోడు, వాదోడుగా ఉందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ గోడలను జగన్ ఇప్పటికే బద్దలు కొట్టారని, ఒట్టి చేతులతోనే టీడీపీ గోడలను బద్దలుకొట్టగల ధీరుడు జగన్ అని అన్నారు. వైయస్ఆర్ ఆలోచనలే వైసీపీ సిద్ధాంతాలని చెప్పారు. రాజకీయం అంటే అధికారం అనేది చంద్రబాబు సిద్ధాంతమని ఎద్దేవా చేశారు. 

jagan
Chandrababu
ysr
bhumana
  • Loading...

More Telugu News