Hyderabad: హైదరాబాద్‌లో మోస్తరు వర్షం

  • హైదరాబాద్‌ వాసులకు కాస్త ఉపశమనం
  • కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు
  • సేదదీరిన నగరవాసులు

ఎండల వేడితో సతమతమవుతోన్న హైదరాబాద్‌ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. ఈ రోజు పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడడంతో నగరవాసులు సేదదీరారు. హైదరాబాద్‌లోని పలు చోట్ల ఓ మోస్తరు వర్షం పడుతోంది. బేగంపేట, పార్సీగుట్ట, బన్సీలాల్‌ పేట, రాణిగంజ్‌, హబ్సిగూడ, తార్నాక, ఆలుగడ్డ బావి, ఓయూ, విద్యానగర్‌, చిలకలగూడ, రాంనగర్‌, పద్మారావు నగర్‌, చిలకలగూడ, వారాసిగూడ, మోండా మార్కెట్‌లో వర్షం పడుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి.

Hyderabad
rain
secunderabad
  • Loading...

More Telugu News