sensex: ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడుతూ... ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

  • వేచి చూసే ధోరణిలో ఇన్వెస్టర్లు
  • 16 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 21 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ గా ముగిశాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశం కానున్న తరుణంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంబించారు. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం నుంచి లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు... చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 16 పాయింట్ల లాభంతో 35,176కు చేరుకుంది. నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి 10,718కి పడిపోయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వీడియోకాన్ ఇండస్ట్రీస్ (9.97%), లక్ష్మీ విలాస్ బ్యాంక్ (6.52%), ఈక్విటాస్ హోల్డింగ్స్ (6.37%), ఇండియా బుల్స్ వెంచర్స్ (6.17%), సయెంట్ లిమిటెడ్ (5.47%).

టాప్ లూజర్స్:
పీసీ జువెలర్స్ (-23.69%), సెంచురీ టెక్స్ టైల్స్ (-9.39%), రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (-9.12%), జస్ట్ డయల్ (-8.67%), అదానీ ఎంటర్ ప్రైజెస్ (-7.74%).      

  • Loading...

More Telugu News