kota srinivas rao: ఎవరి ముందు చేయి చాచే అవసరం రాలేదు!: కోట శ్రీనివాసరావు

  • చెడు ఎక్కువగా చూశాను 
  • అందుకే మంచి ఎక్కువగా చెబుతుంటాను 
  • నా గురించి మంచి - చెడు మాట్లాడుకునే వాళ్లున్నారు     

పాత్రకి ప్రాణం పోసి .. సన్నివేశాలను రక్తి కట్టించిన సహజ నటులలో కోట శ్రీనివాసరావు ఒకరు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను ప్రస్తావించారు. సినిమా ఇండస్ట్రీలో వుంటే చెడిపోయే అవకాశాలు ఎక్కువనే విషయంపై ఆయన తనదైన శైలిలో స్పందించారు.

" నాకు చెడు ఎక్కువగా తెలుసు .. అందువలన మంచి గురించి చెబుతుంటాను. చెడు చేశానా .. చూశానా అనేది వేరే సంగతి. చెడు ఎలా ఉంటుందనేది చూశాను .. దాని పర్యవసానాన్ని అనుభవించాను. చెడిపోయినవాళ్లతో తిరిగి ఉంటానేమోగానీ, నేనెవరినీ చెడగొట్టడం .. నా వలన ఎవరూ చెడిపోవడం జరగలేదు. నేను ఎవరిముందు చేయిచాచలేదు .. ఎవరి ముందు చేయి చాచకపోవడం కన్నా అదృష్టం ఏవుంటుంది? ఏదైనా సరే ముఖం మీదే చెప్పేస్తాడు అని నన్ను విమర్శించేవాళ్లు వున్నారు .. బోళామనిషినని అనుకునేవారు వున్నారు" అంటూ చెప్పుకొచ్చారు.   

kota srinivas rao
  • Loading...

More Telugu News