తెలుగు రాష్ట్రాల్లో 'నా పేరు సూర్య' స్పెషల్ షోలకు అనుమతి
- బన్నీ హీరోగా 'నా పేరు సూర్య'
- కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్
- మే 4వ తేదీన విడుదల
అందువలన 'రంగస్థలం' .. 'భరత్ అనే నేను' సినిమాల స్పెషల్ షోలకి అనుమతి లభించినంత తేలికగా ఈ సినిమాకి రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ సినిమా స్పెషల్ షోలకి ఆంధ్రలోనే కాదు .. తెలంగాణలోను అనుమతి లభించింది. మే 4వ తేదీ నుంచి 11వ తారీకు వరకూ ఉదయం 5 గంటల నుంచి 10 గంటలలోపు అదనంగా ఒక షోను ప్రదర్శించనున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇక ఏ స్థాయి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.