Red Fort: వారసత్వ కట్టడాల దత్తత: గోల్కొండపై కన్నేసిన జీఎంఆర్... చార్మినార్ కావాలంటున్న ఐటీసీ!

  • దాల్మియా గ్రూప్ నకు ఎర్రకోట దత్తత
  • గోల్కొండను దత్తత తీసుకునేందుకు జీఎంఆర్ స్పోర్ట్స్ ఆసక్తి
  • చార్మినార్ కోసం దరఖాస్తు చేసిన ఐటీసీ

ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్ర కోటను దాల్మియా గ్రూప్ దత్తత తీసుకున్న వేళ, హైదరాబాద్ 400 ఏళ్ల చరిత్రకు నిదర్శనంగా ఉన్న చార్మినార్ ను దత్తత తీసుకునేందుకు ఐటీసీ హోటల్స్ ఆసక్తిని చూపుతూ కేంద్రానికి లేఖ రాసింది. ఈ మేరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన దత్తత కమిటీకి దరఖాస్తును పంపింది.

ఇదే సమయంలో గోల్కొండ కోటను దత్తత తీసుకునేందుకు జీఎంఆర్ అనుబంధ సంస్థ జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ డేర్ డెవిల్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమాన్య సంస్థ) ఆసక్తిని చూపుతూ దరఖాస్తు చేసింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. దాల్మియాతో పాటు ఎర్రకోట దత్తతకు తాము కూడా దరఖాస్తు చేశామని, అయితే షార్ట్ లిస్ట్ తరువాత దాల్మియాను ఎంపిక చేశారని చెప్పిన ఓ అధికారి, గోల్కొండ కోట తమకు దక్కుతుందనే భావిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.

Red Fort
Charminar
Golkonda Fort
ITC
GMR Sports
Dalmiya
  • Loading...

More Telugu News