whatsapp: వాట్సాప్ గ్రూపులో అడ్మిన్ అనుమతి లేకుండా ఇకపై ఏమీ చేయలేరు!

  • గ్రూపు ఐకాన్ ను మార్చాలంటే...
  • వీడియోలు, సందేశాలు పోస్ట్ చేయాలంటే...
  • అన్నింటికీ అడ్మిన్ అనుమతి ఉండాల్సిందే
  • పరీక్షల దశలో కొత్త ఫీచర్లు

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్న వాట్సాప్ విప్లవాత్మక మార్పులతో ముందుకు వస్తోంది. ఇకపై వాట్సాప్ లో అడ్మిన్ తిరుగులేని వ్యక్తిగా ఉండనున్నారు. ఇప్పటి వరకు గ్రూపు ఐకాన్ ను, స్టేటస్ ను సభ్యుల్లో ఎవరైనా మార్చేందుకు అవకాశం ఉంది. కానీ, ఇకపై అలా చేయాలంటే కుదరదు. అడ్మిన్ ఆ పవర్ ఇస్తేనే సభ్యులు చేయగలరు. అడ్మిన్ తన పరిధిలోనే ఆ అధికారాలను ఉంచుకోవచ్చు. లేదా అందరు సభ్యులను ఇంతకుముందు మాదిరే అనుమతించొచ్చు. లేదా కేవలం కొంత మందికే ఆ అధికారం ఇవ్వొచ్చు.

ఈ ఫీచర్ ను అడ్మిన్లు గ్రూప్ ఇన్ఫోలో చూడొచ్చు. గ్రూప్ సెట్టింగ్స్ లోకి వెళితే అక్కడ పలు ఆప్షన్లు కనిపిస్తాయి. అక్కడే ఎడిట్ గ్రూపు ఇన్ఫో  అనే ఆప్షన్ ఎంచుకోవాలి. గ్రూపు ఇన్ఫర్మేషన్ ఎవరు మార్చాలన్నది అక్కడ డిసైడ్ చేయవచ్చు. ఓన్లీ అడ్మిన్, ఆల్ పార్టిసిపెంట్స్ (అందరూ), అదర్స్ (ఇతరులు కొందరు మాత్రమే) ఆప్షన్లలో అడ్మిన్ దేన్నైనా ఎంపిక చేసుకోవచ్చు.

ఇక గ్రూపులో వీడియోలు, సందేశాలు, ఫొటోలు పోస్ట్ చేయకుండా కొందరు సభ్యుల్ని అడ్మిన్ బ్లాక్ చేయవచ్చు. ఇదొక ఫీఛర్. అలాగే, తనకు ఎవరు పర్సనల్ గా మెస్సేజ్ చేయవచ్చో కూడా అడ్మిన్ నిర్ణయించుకోవచ్చు. అంటే సభ్యులు గ్రూపులో ఏది పంపాలనుకున్నా ముందు అడ్మిన్ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ల సమాచారాన్ని వాబీటా ఇన్ఫో అనే సంస్థ వెల్లడించింది.

  • Loading...

More Telugu News