balakrishna: ఎన్టీఆర్‌ బయోపిక్‌ .. దర్శకత్వ పర్యవేక్షకుడిగా మరో దర్శకుడు

  • 'ఎన్టీఆర్' మూవీ నిర్మాతగా బాలకృష్ణ 
  • దర్శకుడిగాను ఆయనే
  • దర్శకత్వ పర్యవేక్షణకోసం సంప్రదింపులు   

నందమూరి తారకరామారావు జీవితచరిత్రను రూపొందించడానికి బాలకృష్ణ రంగంలోకి దిగారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ఆయన పోషించడమే కాదు .. ఆయనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రెగ్యులర్ షూటింగు ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తుండగా, దర్శకుడు తేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.

దాంతో తానే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను చేపట్టాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. అయితే దర్శకత్వ పర్యవేక్షణ చేసి పెట్టమని ఆయన రాఘవేంద్రరావు .. క్రిష్ .. కృష్ణవంశీలను సంప్రదించారట. అయితే ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉండటం వలన కుదరదని చెప్పారట. ఈ నేపథ్యంలో తెరపైకి 'చంద్ర సిద్ధార్థ' పేరు వచ్చింది. 'ఆ నలుగురు' సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న చంద్ర సిద్ధార్థ ఈ సినిమా దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతను చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం అధికారికంగా వెలువడవలసి వుంది. 

  • Loading...

More Telugu News