అమెరికా .. ఆస్ట్రేలియాల్లో తగ్గని 'భరత్' దూకుడు
- హిట్ అనిపించుకున్న 'భరత్'
- విదేశాల్లో భారీ వసూళ్లు
- ఫుల్ రన్లో మరిన్ని వసూళ్లు
ఏప్రిల్ 20వ తేదీన విడుదలైన ఈ సినిమా, 10 రోజుల్లో అమెరికాలో 21 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఇక ఆస్ట్రేలియాలో 2.23 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ ప్రాంతాల్లో మహేశ్ మూవీ ఇంత సమయంలో ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఇదే ఫస్టు టైమ్ అని అంటున్నారు. ఫుల్ రన్ ముగిసేనాటికి ఈ సినిమా మరిన్ని వసూళ్లను రాబట్టడం ఖాయమని చెబుతున్నారు. మొత్తానికి మహేశ్ విదేశాల్లోను విజయవిహారం చేస్తున్నాడు.