Nagababu: మీడియాపై నిషేధమా? అబ్బే.. అలాంటిదేమీ లేదు: క్లారిటీ ఇచ్చిన నాగబాబు

  • అల్లు అరవింద్ ఏదో అవేశంలో అలా అన్నారు అంతే
  • చిత్ర పరిశ్రమ మంచి కోసమే సమావేశం
  • అభిమానులను కంట్రోల్ చేయడం తప్ప మాకేమీ పనులుండవా?

మీడియాను బహిష్కరించాలని చిత్ర పరిశ్రమ నిర్ణయం తీసుకున్నట్టు వచ్చిన వార్తలపై మెగా హీరో నాగబాబు క్లారిటీ ఇచ్చారు. అసలు అలాంటి ఆలోచనే లేదని, లేని దానిని ఉన్నట్టు ఎలా చెబుతామని అన్నారు. ఇటీవల చిరంజీవి నేతృత్వంలో నిర్వహించిన హీరోల సమావేశంలో మీడియా సంస్థలపై నిషేధం విధించాలని నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై నాగబాబు స్పందన కోరగా ఆయన పై విధంగా స్పందించారు. ఆ సమావేశంలో చిత్ర పరిశ్రమ మంచి కోసం ఏం చేయాలన్నదానిపైనే చర్చించామన్నారు. మీడియాపై నిషేధం విధించడానికి తామేమీ పెదరాయుళ్లం కాదని పేర్కొన్నారు.

సినిమా విడుదలకు ముందే కొందరు బాగాలేదని ప్రచారం చేస్తుండడంతో అరవింద్ గారు కలత చెంది అలా అన్నారు తప్పితే అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. అల్లు అర్జున్ హీరోగా, నాగబాబు సమర్పణలో, లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా శుక్రవారం విడదుల కాబోతోంది. ఈ సందర్బంగా నాగబాబు మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

పవన్ కల్యాణ్ వివాదంపై మాట్లాడుతూ.. ఆవేశ పడవద్దని తమతో టచ్‌లో ఉన్న లక్షలాదిమంది అభిమానులకు తాను, పవన్ పదేపదే చెబుతున్నామని పేర్కొన్నారు. మెగా అభిమానులను కంట్రోల్ చేయలేరా? అని చాలామంది అంటున్నారని, అలా అంటున్నవారికి కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. వారిని కంట్రోల్‌లో పెట్టడం తప్ప తమకు మరే పనులూ ఉండవా? అని ప్రశ్నించారు. లైమ్‌లైట్‌లో ఉండాలని కొందరు కావాలనే తాము హర్ట్ అయ్యేలా మాట్లాడుతున్నారని, అటువంటి వాళ్లనే అభిమానులు ఆవేశంలో తిడుతున్నారని నాగబాబు వివరించారు.  

  • Loading...

More Telugu News