TTD: టీటీడీ కొత్త ప్రయోగం... ఇకపై కోరుకున్న సమయంలో స్వామి దర్శనం!

  • తిరుమలలో టైమ్ స్లాట్ దర్శనం ప్రారంభం
  • రోజుకు 38 వేల మందికి టోకెన్ల ద్వారా దర్శనం
  • 109 కౌంటర్ల ఏర్పాటు: టీటీడీ

ఇప్పటికే సర్వదర్శనం భక్తులకు టైమ్ స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టిన టీటీడీ మరో కొత్త ప్రయోగం చేయనుంది. తమకు దర్శనం ఎన్ని గంటలకు కావాలని భక్తుడు కోరుకుంటాడో, ఆ సమయంలోనే టైమ్ స్లాట్ కేటాయించాలని నిర్ణయించింది. ఎటొచ్చీ ఆ సమయంలో స్లాట్ లో ఖాళీ ఉండాలంతే. భక్తులకు టోకెన్లు జారీ చేసేందుకు తిరుమల, తిరుపతి, రెండు కాలినడక మార్గాల్లో 109 కౌంటర్లను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.

రోజుకు 23 వేల నుంచి 38 వేల మందికి టోకెన్లు జారీ చేస్తామని, వీరు తదుపరి 24 గంటల వ్యవధిలో తనకు నచ్చిన సమయాన్ని ముందే ఎంచుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. ఆ సమయానికి క్యూలైన్ లోకి వెళితే, రెండు నుంచి మూడు గంటల్లోనే బయటకు రావచ్చని వెల్లడించారు. తిరుమలలోని విచారణ కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేశామని, తిరుపతిలో రైల్వేస్టేషన్, బస్టాండ్, శ్రీనివాసం గెస్ట్ హౌస్, అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో కూడా ఉన్నాయని వెల్లడించారు.

TTD
Tirumala
Tirupati
Time Slot
  • Loading...

More Telugu News