KCR: 150 సీట్లతో సిద్ధిపేట మెడికల్ కాలేజీ స్థాపనకు అనుమతి

  • మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయం
  • నిజామాబాద్ మెడికల్ కాలేజీలో 100 సీట్ల పునరుద్ధరణ
  • మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీకి 150 సీట్లకు రెన్యూవల్

సిద్ధిపేట మెడికల్ కాలేజీ స్థాపనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లైన్ క్లియర్ చేసింది. అలాగే, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ 3వ బ్యాచ్ 150 ఎంబీబీఎస్‌ సీట్లకు, నిజామాబాద్ మెడికల్ కాలేజీ 100 సీట్లకు కూడా రెన్యూవల్ ఇచ్చింది. మెడికల్ కాలేజీలు సీట్ల పెంపునకు అన్ని విధాలుగా దిశా నిర్దేశం చేసి, సహకరించిన సీఎం కేసీఆర్‌కి, ఎంసీఐకి తెలంగాణ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో 2018-19 ఏడాదికి 150 సీట్లతో సిద్ధిపేట మెడికల్ కాలేజీ స్థాపనకు 10 ఏ ఐఎంసీ యాక్ట్‌ 1956 చట్టం ప్రకారం... ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిఫారసు చేసింది. దీనితో కేంద్ర ప్రభుత్వ అనుమతి ఇక లాంఛనం మాత్రమే. కాగా, 2018-19 ఏడాదికి మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో 3 వ బ్యాచ్ 150 సీట్లకు రెన్యూవల్ వచ్చింది. ఇదిలా ఉండగా నిజామాబాద్ మెడికల్ కాలేజి 100 సీట్ల రెన్యూవల్ కి కూడా అనుమతి లభించింది.

సీఎం కేసీఆర్‌కి, ఎంసీఐకి కృతజ్ఞతలు: లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు రావడానికి అవసరమైన దిశా నిర్దేశం చేసిన సీఎం కేసీఆర్ కి లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మెడికల్ కాలేజీ అనుమతులు రావడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో సీఎం సహకారం మరవలేనిదన్నారు. సిద్ధిపేట మెడికల్ కాలేజీ స్థాపనలో అవసరమైన భూ సేకరణ, ఇతర వసతుల విషయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చొరవ కూడా కీలకమన్నారు. అనుమతులు ఇవ్వడానికి సహకరించిన ఎంసీఐకి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే తరహాలో సీఎం కేసీఆర్ తలపెట్టిన సూర్యాపేట, నల్గొండ మెడికల్ కాలేజీలని కూడా సాధిస్తామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 

KCR
Siddipet District
laxma reddy
  • Loading...

More Telugu News