Karnataka: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేశాం: సిద్ధరామయ్య లేఖ

  • కర్ణాటకలోని తెలుగువారికి సీఎం సిద్ధరామయ్య లేఖ
  • ఈసారి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను బలపర్చాలని లేఖలో వినతి
  • తెలుగు, కన్నడ ప్రజలది తరతరాల సోదర బంధమని వ్యాఖ్య

ఈ నెల 12న జరిగే తమ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలోని తెలుగువారికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేఖ రాసి తమ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశామని, తమకు మళ్లీ అవకాశం కల్పించాలని అందులో పేర్కొన్నారు. తెలుగు, కన్నడ ప్రజలది తరతరాల సోదర బంధం అని, దశాబ్దాలుగా తెలుగువారు ఇక్కడ స్థిరపడి ఇక్కడి సంస్కృతిలో భాగమయ్యారని అన్నారు.

ఏపీకి తమ పార్టీ అప్పట్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బీజేపీ ద్రోహం చేసిందని, విభజన హామీలు అమలు చేయకుండా ఏపీ, తెలంగాణకు అన్యాయం చేసిందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. తాము తాజాగా జరిపిన కాంగ్రెస్‌ పాలిత ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేశామని అన్నారు.    

Karnataka
sidda ramaiah
Andhra Pradesh
  • Loading...

More Telugu News