sai kumar: పవన్ కల్యాణ్ వచ్చి ప్రచారం చేసినా... మాదే గెలుపు!: సాయికుమార్ ధీమా

  • బాగేపల్లిలో నా విజయం ఖాయం
  • పవన్ కల్యాణ్ కు ఇచ్చేందుకు నావద్ద కౌంటర్లు ఉన్నాయి
  • కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. హంగ్ వస్తుందనే సర్వేల నేపథ్యంలో, విజయం కోసం వివిధ పార్టీల అభ్యర్థులు చెమటోడుస్తున్నారు. ప్రధాని మోదీ కూడా కర్ణాటకలో వరుసగా సభలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో, బాగేపల్లి నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న సినీ నటుడు సాయికుమార్ మాట్లాడుతూ, తన విజయం ఖాయమని చెప్పారు. సాక్షాత్తు పవన్ కల్యాణ్ వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా... ఆయనకు ఇచ్చేందుకు తన వద్ద కౌంటర్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. తెలుగువారు అధికంగా ఉండే బాగేపల్లి నియోజకవర్గంలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News