Jana Sena: అంతర్జాతీయ స్థాయిలో పనిచేశా.. పవన్‌ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం: జనసేన పార్టీ ఎన్నికల వ్యూహకర్త దేవ్

  • బలమైన భావజాలానికి పటిష్టమైన వ్యూహం తోడు 
  • ఈ రంగంలో దశాబ్ద కాలంగా ఉన్నాను
  • గొప్ప దృక్పథం ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్
  • ఎన్నికలప్పుడు ముఖం చూపించి వెళ్లిపోయే వ్యక్తి కాదు

హైదరాబాద్‌లో తమ పార్టీ ముఖ్య కార్యకర్తలతో జరిపిన సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. తమ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా దేవ్‌ అనే వ్యక్తిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేవ్‌ తనను తాను పరిచయం చేసుకున్నారు. పార్టీని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. 
 
"జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో కలిసి పని చేసిన అనుభవం నాకు ఉంది. ఈ రంగంలో దశాబ్ద కాలంగా ఉన్నాను. గొప్ప దృక్పథం ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్. ఎన్నికలప్పుడు వచ్చి ముఖం చూపించి వెళ్లిపోయేటటువంటి రాజకీయనాయకుడు కాదు. ఆయనకు ప్రజా సమస్యల పట్ల, సామాజిక అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది.

జనసేన పార్టీకి బలమైన భావజాలాల్ని, సిద్ధాంతాల్ని రూపొందించారు. అందుకు పటిష్టమైన వ్యూహాన్ని జోడిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తాం. ఇందుకు బూత్‌స్థాయి నుంచి పకడ్బందీగా ప్రణాళికలు వేసుకోవాలి. నా టీమ్‌కు మీ అందరి సహకారం అవసరం. రాజకీయంగా పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ పవన్‌ కల్యాణ్‌ ఆలోచనలను, సిద్ధాంతాల్నీ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలతో పాటు ఎన్నికల వరకు అనుసరించాల్సిన వ్యూహాల్నీ మీతో ఎప్పటికప్పుడు పంచుకుంటాను. ప్రజలతో మమేకమయ్యే పార్టీ జనసేన.. ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పని చేద్దాం" అని అన్నారు.

Jana Sena
dev
Hyderabad
Pawan Kalyan
  • Loading...

More Telugu News