lalu prasad yadav: రాంచీ ఆసుపత్రిలో లాలూ ప్రసాద్ యాదవ్... వయసు సంబంధిత అనారోగ్య సమస్యలు!

  • లాలూ ఆరోగ్యం మెరుగ్గా ఉంది
  • వయసురీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి
  • ఆరోగ్య పరిస్థితిని వివరించిన రాంచీ వైద్యులు

ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి నిన్న డిశ్చార్జ్ అయిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, ఆయన ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గా ఉందని చెప్పారు. అయితే వయసురీత్యా కొన్ని ఇబ్బందులు ఆయనకు ఉన్నాయని తెలిపారు.

కొన్ని రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించడంతోనే, ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ కు రెఫర్ చేశామని రిమ్స్ పీఆర్వో తెలిపారు. అయితే, చికిత్స మధ్యలోనే తనను ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ చేశారని... తన ఆరోగ్యాన్ని క్షీణింపజేసే కుట్రలు దీని వెనుక ఉన్నాయని లాలూ ఆరోపించిన సంగతి తెలిసిందే. దాణా కుంభకోణంలో రాంచీ జైల్లో లాలూ శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 

lalu prasad yadav
health
condition
aiims
ranchi
medical college hospital
  • Loading...

More Telugu News