nagababu: జనసేన తరఫున పోటీ చేస్తానా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేను: నాగబాబు

  • వివాదం తలెత్తినప్పుడు ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయలేం
  • ఎవరో తప్పు చేస్తే, మమ్మల్ని బాధ్యులను చేయడం మంచిది కాదు
  • జనసేన నుంచి పోటీ చేయడంపై ఇప్పుడేం చెప్పలేను

ఇండస్ట్రీలో సమస్య తలెత్తినప్పుడు మెగా హీరోలు స్పందించలేదు అనే వార్తల్లో నిజం లేదని... మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స్పందించినప్పుడు వ్యక్తిగతంగా తాము జోక్యం చేసుకోవడం ఎందుకనే భావనతో ఉన్నామని నాగబాబు చెప్పారు. ఏదైనా వివాదం చెలరేగినప్పుడు ఫ్యాన్స్ ను కట్టడి చేయడం సాధ్యం కాదని... తమ పరిధిలో ఉన్నవారిని మాత్రమే నియంత్రించగలమని, లక్షలాది మంది అభిమానుల్లో ఎవరో ఒకరు తప్పు చేస్తే, దానికి తమను బాధ్యులను చేయడం సరికాదని అన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని, ఎవరు ఎలా స్పందిస్తారో తమకెలా తెలుస్తుందని ప్రశ్నించారు.

జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తానా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదని నాగబాబు అన్నారు. అసలు ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తానా? లేదా? అనే విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పలేనని తెలిపారు. దీని గురించి ఇప్పుడు ఏం మాట్లాడినా తొందరపాటే అవుతుందని అన్నారు. 

nagababu
Jana Sena
tollywood
mega fans
  • Loading...

More Telugu News