వెరైటీగా 'టాక్సీవాలా' ప్రమోషన్ .. ఆసక్తిని రేకెత్తిస్తోన్న వీడియో!
- విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీవాలా'
- కథానాయికగా మాళవిక శర్మ
- ఈ నెల 18వ తేదీన భారీ రిలీజ్
'అర్జున్ రెడ్డి' తరువాత తన దగ్గర నాలుగు స్క్రిప్టులు ఉన్నాయనీ .. వాటిలో ఏది ఎంపిక చేసుకోవాలో తెలియక తాను సతమతమైపోతుంటే, ఓ నలుగురు ఆకతాయి పిల్లలు తన కలలోకి వచ్చారని విజయ్ దేవరకొండ చెప్పాడు. వాళ్లే 'టాక్సీవాలా' స్క్రిప్ట్ చేయమని చెప్పారనీ .. అందువల్లనే చేశానని అన్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఆసక్తిని రేపుతూ .. ఈ సినిమా కోసం వెయిట్ చేసేలా చేస్తోంది.