saidharam tej: ఆకట్టుకుంటోన్న 'తేజ్ ఐ లవ్ యు' టీజర్

  • కరుణాకరన్ దర్శకత్వంలో 'తేజ్ ఐ లవ్ యు'
  • హీరోగా సాయిధరమ్ తేజ్
  • నాయికగా అనుపమ పరమేశ్వరన్

కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. రీసెంట్ గా ఈ సినిమాకి 'తేజ్ ఐ లవ్ యు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు.

జోరున వర్షం కురుస్తుంటే .. రోడ్డు పక్కనే నిలబడి వేడివేడిగా 'టీ' తాగుతుంటాడు తేజు. ఆయనకి కాస్త దూరంలో కూర్చుని అనుపమ 'గిటార్' మీటుతూ ఉంటుంది. అక్కడున్న ఆమె హఠాత్తుగా అతని అక్కున చేరి 'టీ' షేర్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అంతలో రోడ్ పై వెళుతోన్న వెహికల్ హారన్ సౌండ్ కి ఆయన ఈ లోకంలోకి వస్తాడు. అదంతా భ్రమేననుకుని నవ్వుకుంటాడు. ఈ ఫన్నీ టీజర్ యూత్ ను బాగానే ఆకట్టుకుంటుందని చెప్పాలి.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News