charan: చరణ్ మూవీ టైటిల్ 'రాజ మార్తాండ' కాదట!

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ 
  • రెండవ షెడ్యూల్ చిత్రీకరణ 
  • విలన్ గా వివేక్ ఒబెరాయ్    

బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని నటిస్తోంది. అప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. రీసెంట్ గా రెండవ షెడ్యూల్ ను నిర్వహిస్తున్నారు.

ఈ షెడ్యూల్లో చరణ్ పాల్గొంటున్నాడు. ఆయన కాంబినేషన్లోని సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి 'రాజ వంశస్థుడు' .. 'రాజమార్తాండ' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకూ ఈ సినిమాకి ఏ టైటిల్ ను ఫిక్స్ చేయలేదనేది చిత్ర సన్నిహితవర్గాల మాట. త్వరలోనే టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.    

  • Loading...

More Telugu News