Karnataka: ప్రకాష్ రాజ్ పై బీజేపీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు!

  • నరేంద్ర మోదీని ఆయన దూషించారు
  • పోలీసులకు, ఈసీకి ఫిర్యాదు చేసిన గణేష్ యాజి
  • ప్రతిగా బీజేపీ నేతలపై కాంగ్రెస్ ఫిర్యాదు

నటుడు ప్రకాష్ రాజ్ ప్రధాని నరేంద్ర మోదీని తీవ్ర పదజాలంతో దూషించాడని, ఈ విషయమై వెంటనే విచారించి ఆయన్ను అరెస్ట్ చేయాలని కర్ణాటక బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ నేత గణేష్ యాజి పోలీసులతో పాటు ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు ప్రతిని పంపించారు. మోదీతో పాటు తమ నేత యడ్యూరప్పపైనా ప్రకాష్ రాజ్ అనుచిత విమర్శలు చేశారని తెలిపారు. గుజరాత్ ఎమ్మెల్యే జిజ్ఞేష్ మెవానిపైనా ఆయన ఫిర్యాదు చేశారు.

ఇదిలావుండగా, బీజేపీ నేత ఈశ్వరప్ప, సీఎం సిద్దరామయ్యను అసభ్య పదజాలంతో దూషించారని ఈసీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కర్ణాటక ఎన్నికల్లో ఇలా ఫిర్యాదుల పర్వం కొనసాగుతుండగా, మరోవైపు డబ్బు, మద్యం ఏరులై పారుతున్నట్టు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసుకున్న డబ్బులతో పాటు పట్టు చీరలు, వెండి కానుకలను పోలీసులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Karnataka
BJP
Congress
Prakash Raj
Election Commission
  • Loading...

More Telugu News