Srikakulam District: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ శాఖ

  • భారీ సంఖ్యలో పిడుగులు పడే అవకాశం
  • సురక్షితమైన ఇళ్లలో ఉండాలంటూ అధికారుల సూచన
  • శ్రీకాకుళంలో పలు చోట్ల భారీ వర్షాలు

ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మూడు జిల్లాలో భారీ సంఖ్యలో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా పూర్తి అప్రమత్తతతో ఉండాలని అన్నారు. సురక్షితమైన ఇళ్లలో ఉండాలని సూచించారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, ఆముదాలవలస, పలాస, ఇచ్ఛాపురంలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, పార్వతీపురం ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. 

Srikakulam District
Vijayanagaram District
Visakhapatnam District
thunders
  • Loading...

More Telugu News