Rain: పట్టపగలు విజయనగరాన్ని కమ్మేసిన చీకటి!

  • దట్టమైన మేఘాలతో నిండిపోయిన ఆకాశం
  • మండే ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం
  • విశాఖ జిల్లాలోనూ వర్షాలు

ఈ ఉదయం నుంచి ఉత్తర కోస్తా తీరంలోని విజయనగరం, పార్వతీపురం, కురుపాం, గజపతినగరం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దట్టమైన మేఘాలతో ఆకాశం నిండిపోగా, పట్టపగలే చిమ్మ చీకటి ఆవరించింది. నిన్నటివరకూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతతో అల్లాడిన జిల్లా ప్రజలు, సూర్యుడు శాంతించడంతో సేదదీరుతున్నారు.

మండుతున్న ఎండల నుంచి ఈ వర్షాలు కాస్తంత ఉపశమనాన్ని కలిగిస్తుండగా, ఉదయం బయటకు వచ్చిన వారు, చీకటి పడుతున్న వాతావరణం కనిపిస్తుండటంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా, విశాఖపట్నం జిల్లాలోని తగరపువలస, పాడేరు తదితర ప్రాంతాల్లోనూ మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

Rain
Sun
Heat
Vizag
Vijayanagaram District
  • Loading...

More Telugu News