YSRCP: జగన్ పర్యటనలో నేతల అలక.. పాదయాత్ర నుంచి వాకౌట్!

  • నియోజకవర్గంలో జోగి రమేష్ జోక్యం పెరిగిందన్న నేతలు
  • పాదయాత్ర మధ్యలోనే వెళ్లిపోయిన  ఉప్పాల, ఆనందప్రసాద్
  • అయోమయానికి గురైన పార్టీ శ్రేణులు 

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో పాల్గొనకుండా కొందరు నేతలు వాకౌట్ చేశారు. సోమవారం కృష్ణా జిల్లా పామర్రు నుంచి జగన్ పాదయాత్ర మొదలైంది. పెడన వైసీపీ ఇన్‌చార్జ్ ఉప్పాల రాంప్రసాద్, మునిసిపల్ చైర్మన్ ఆనందప్రసాద్, ఆయన అనుచరులు పాదయాత్రలో పాల్గొనకుండా అలిగి వెళ్లిపోయారు. నియోజకవర్గంలో జోగి రమేష్ జోక్యం పెరిగిందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ యాత్ర మధ్య నుంచి వెళ్లిపోవడంతో ఏం జరిగిందో అర్థం కాక వైసీపీ శ్రేణులు అయోమయానికి గురయ్యారు.  

జగన్ తన పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. సరిగ్గా నాలుగేళ్ల కిందట ఏప్రిల్‌ 30న వెంకన్న సాక్షిగా తిరుపతిలో సభ పెట్టి టీడీపీ, బీజేపీలు ప్రత్యేక హోదా హామీ ఇచ్చాయని గుర్తు చేసిన జగన్ ఇప్పుడు హోదాకు వెన్నుపోటు పొడిచారని, ధర్మపోరాట సభ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని జగన్ విమర్శించారు.

  • Loading...

More Telugu News