Chandrababu: ఎవరిని బలపర్చడానికి నన్ను విమర్శిస్తున్నారు?: చంద్రబాబు ఆగ్రహం

  • మనమైతే బీజేపీ పెద్దల మాట వినం
  • ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తులనైతే కంట్రోల్ చేసుకోవచ్చు
  • మనం కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నాం
  • పోరాడుతోన్న వారిని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు

తమకు పదవులు ముఖ్యం కాదని, తాము వాటి కోసం ఎప్పుడూ పాకులాడలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశామని చెప్పారు. ఈ రోజు ఆయన తిరుపతిలో ధర్మ పోరాట సభలో మాట్లాడుతూ... "మనమైతే బీజేపీ పెద్దల మాట వినం. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తులనైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరూ అడగక ముందే ఏక పక్షంగా మద్దతు ఇస్తామని చెప్పారు.

ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మనం కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతుంటే, పోరాడుతోన్న వారిని వారు విమర్శిస్తున్నారు. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పోరాడుతోంటే వీళ్లు (వైసీపీ నేతలు) నన్ను విమర్శిస్తున్నారంటే ఎవరిని బలపర్చడానికో ఓ సారి ఆలోచించండి. మీరందరూ ఓట్లేస్తే ముఖ్యమంత్రిని అయ్యాను. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటానికి కలిసి రావాల్సిందిపోయి ఇలా చేస్తున్నారు.

ఓ పక్క ఇక్కడ నేను ధర్మపోరాట సభ నిర్వహిస్తోంటే మరో పక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు 'నయవంచన' అంటూ మీటింగులు పెట్టారు.. వీరికేమైనా సిగ్గుందా? మేము అవిశ్వాస తీర్మానం పెడితే దేశం మొత్తం మద్దతు తెలిపింది. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి ఆధారాలు చూపిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాను. మాట తప్పి బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. వెంకన్న ఆశీస్సులతో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. మన హక్కుల కోసం మనం పోరాడుతూనే ఉందాం. పోరాటం చేసి సాధించుకునే సత్తా తెలుగువారికి ఉంది" అని అన్నారు. 

  • Loading...

More Telugu News