kadalur: భక్తులకు వడ్డించిన సాంబార్ అన్నంలో బల్లి.. 73 మందికి తీవ్ర అస్వస్థత
- తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘటన
- అమ్మాన్ ఆలయ వేడుకల్లో అపశ్రుతి
- దర్యాప్తు చేపట్టిన పోలీసులు
తమిళనాడులోని కడలూరు జిల్లాలోని ఓ ఆలయంలో ప్రసాదం తిన్న 73 మంది భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 14 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉండటం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే, శతమంగళం గ్రామంలోని అమ్మాన్ ఆలయంలో జరిగిన వేడుకల సందర్భంగా భక్తులకు సాంబార్ అన్నం వడ్డించారు.
ఇది తిన్న కాసేపటికే భక్తులకు తల తిరగడంతోపాటు, వాంతులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో వెంటనే ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తమకు వడ్డించిన అన్నంలో చనిపోయిన బల్లి కనిపించిందని ఆర్డీవోకు భక్తులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.