keerthi suresh: అచ్చం సావిత్రిలా కనిపిస్తూ కీర్తి సురేశ్ మరిన్ని మార్కులు కొట్టేసింది

  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' 
  • సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్
  • మే 9వ తేదీన భారీ రిలీజ్  

సావిత్రి జీవితచరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించాడు. సావిత్రి పాత్రను కీర్తి సురేశ్ పోషించగా, వచ్చేనెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ను .. టీజర్ ను ఇప్పటికే వదిలారు. ఈ పోస్టర్స్ లో కీర్తి సురేశ్ ను చూసిన వాళ్లంతా .. అచ్చం సావిత్రి మాదిరిగానే వుందని అనుకున్నారు.

 తాజాగా అక్కినేని 'దేవదాసు' సినిమా నుంచి సావిత్రి స్టిల్ తో కలిపి .. అదే కాస్ట్యూమ్స్ తో వున్న కీర్తి సురేశ్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అదే కట్టూ బొట్టుతో .. అదే ఎక్స్ ప్రెషన్ తో కీర్తి సురేశ్ .. సావిత్రిలానే అనిపిస్తోంది. ఇంతవరకూ వచ్చిన పోస్టర్స్ లో ఈ పోస్టర్లో ఆమె సావిత్రికి మరీ దగ్గరగా కనిపిస్తూ ఎక్కువ మార్కులు కొట్టేసిందనే చెప్పాలి.        

  • Loading...

More Telugu News