charan: బోయపాటి .. చరణ్ మూవీ టైటిల్ గా 'రాజ మార్తాండ'?

  • షూటింగు దశలో బోయపాటి మూవీ 
  • చరణ్ తదితరులపై చిత్రీకరణ 
  • కథానాయికగా కైరా అద్వాని

'రంగస్థలం' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో, ఆ ఉత్సాహంతో బోయపాటి సినిమా షూటింగులో చరణ్ పాల్గొంటున్నాడు. ఇటీవల చరణ్ బిజీగా ఉండటం వలన ఆయన పాత్ర ప్రమేయం లేని సన్నివేశాలతో ఆల్రెడీ కొంతభాగం చిత్రీకరణను బోయపాటి ఇప్పటికే పూర్తి చేశారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగులో చరణ్ జాయిన్ అయ్యాడు. ఆయన కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాకి 'రాజవంశస్థుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ టైటిల్ చరణ్ క్రేజ్ కి తగినంత పవర్ఫుల్ గా అనిపించడం లేదనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. దాంతో ఈ సినిమాకి 'రాజ మార్తాండ' అనే టైటిల్ ను ఖరారు చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చరణ్ జోడీగా కైరా అద్వాని కనిపించనున్న సంగతి తెలిసిందే.         

  • Loading...

More Telugu News