bse: ప్రతిష్ఠాత్మక మైలురాయి... 35 వేల మార్క్ దాటి దూసుకెళుతున్న మార్కెట్!
- పెరిగిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్
- ఉత్సాహంగా నూతన కొనుగోళ్లు
- 56 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
అంతర్జాతీయ మార్కెట్ నుంచి అందిన సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరుగగా, దేశవాళీ ఫండ్ సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్లు నూతన కొనుగోళ్లను ఉత్సాహంగా చేస్తున్న వేళ బీఎస్ఈ సెన్సెక్స్ మరో మైలురాయిని దాటింది. ఈ వారం ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 35 వేల మైలురాయిని దాటేసి ముందుకు దూసుకెళ్లింది. ఉదయం 9 గంటలకు ట్రేడింగ్ ప్రారంభం కాగా, ఆపై నిమిషాల వ్యవధిలోనే దూసుకెళ్లింది.
ఈ ఉదయం 11:30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 35,171 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 10,748 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. బీఎస్ఈలో 2,400 కంపెనీలు ట్రేడింగ్ అవగా, 1,336 కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయి. ఎన్ఎస్ఈ-50లో 42 కంపెనీలు లాభాల్లో ఉండగా, యస్ బ్యాంక్, ఎస్బీఐ, వీఈడీఎల్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ తదితర కంపెనీలు 1.50 శాతం నుంచి 2.34 శాతం వరకూ లాభాల్లో నడుస్తున్నాయి. ఇదే సమయంలో యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ తదితర కంపెనీల ఈక్విటీలు ఒత్తిడిలో ఉన్నాయి.