wife: నా భార్యను కానిస్టేబుల్ తీసుకెళ్లి ఉండవచ్చంటూ భర్త ఫిర్యాదు!

  • నా భర్తతో కానిస్టేబుల్ కు అక్రమ సంబంధం ఉందంటూ ఫిర్యాదు
  • భార్య కాల్ డేటాలో కానిస్టేబుల్ కాల్స్ వివరాలు
  • పరారీలో ఉన్న కానిస్టేబుల్

తన భార్య కనిపించడం లేదంటూ ఓ భర్త హైదరాబాద్ వనస్థలిపురంలో ఫిర్యాదు చేశాడు. తన భార్య అఖిల వనస్థలిపురం కానిస్టేబుల్ తో ప్రేమాయణం నడుపుతోందని, వారిద్దరి మధ్య అక్రమ సంబంధం నడుస్తోందని ఫిర్యాదులో ఆరోపించాడు. అతనే తన భార్యను తీసుకెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు.

ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అఖిల కాల్ డేటా పరిశీలించగా... ఆమెతో సదరు కానిస్టేబుల్ తరచుగా మాట్లాడినట్టు తేలింది. మరోవైపు, కానిస్టేబుల్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని అచూకీ కనిపెట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అఖిల కనపడకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

wife
husband
constable
affair
  • Loading...

More Telugu News