Kodandaram: తెలంగాణ జన సమితి అధ్యక్షుడిగా కోదండరామ్‌.. పార్టీ జెండా ఆవిష్కరణ

  • సరూర్‌నగర్‌ మైదానంలో ఆవిర్భావ సభ
  • భారీగా తరలివచ్చిన ప్రజలు
  • సభకు హాజరైన ప్రొఫెసర్‌ హరగోపాల్

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ మైదానంలో తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ సభ కొనసాగుతోంది. ఈ సభలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడిగా కోదండరామ్‌ను ఆ పార్టీ నేతలు అంబటి శ్రీనివాస్‌, భిక్షపతి ప్రతిపాదించగా, అనంతరం పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికను నేతలు, కార్యకర్తలు ఆమోదించారు. ఈ సందర్భంగా తమ పార్టీ జెండాను కోదండరామ్ ఆవిష్కరించారు. ప్రజలు భారీగా తరలివచ్చిన ఈ సభలో ప్రొఫెసర్‌ హరగోపాల్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదని టీఆర్‌ఎస్‌ సర్కారు తీరుని సభలో తెజస నేతలు ఎండగడుతున్నారు. కాగా, తెలంగాణ జన సమితికి 'తీన్మార్‌' మల్లన్న రూ.1,00,116 విరాళం ఇచ్చారు.        

Kodandaram
Telangana
Telangana Jana Samithi
  • Loading...

More Telugu News