samanta: అభిమానులకు ట్విట్టర్‌లో పోటీ పెట్టిన సమంత.. బాగా చేస్తే గిఫ్ట్‌లు!

  • విడుదలకు సిద్ధమవుతోన్న 'మహానటి' 
  • 'అహ నా పెళ్లి అంటా' అంటూ డ్యాన్స్ చేస్తే గిఫ్ట్‌లు
  • సావిత్రిలా చేసి అలరించిన సమంత

దక్షిణాది అగ్రహీరోయిన్లలో ఒకరిగా ఉన్న సమంత తాజాగా అభిమానులకు ఓ పోటీ పెట్టింది. ఆమె కీలక పాత్రలో నటిస్తోన్న 'మహానటి' సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలనాటి మేటి చిత్రం మాయాబజార్‌లోని ‘అహ నా పెళ్లంట.. ఓహో నా పెళ్లంట’ పాటలో సావిత్రిలా చేయడానికి ప్రయత్నించింది. ఇలా చేయడం చాలా కష్టమని, సావిత్రిని ఊరికే మహానటి అంటారా? అని వ్యాఖ్యానించింది.

ఇది అహ నా పెళ్లి అంట వీడియో అని, ఎవరైనా సరే ఈ పాటలో సావిత్రిలా బెస్ట్ వర్షన్ వీడియోస్ చేసి తమకు పంపిస్తే, నచ్చిన వీడియోస్ చేసిన వారికి స్పెషల్ గిఫ్ట్ పంపిస్తానని చెప్పింది. వైజయంతి మూవీస్‌ వారి మహానటి ఫన్ ఛాలెంజ్‌ పేరిట ఈ పోటీ నిర్వహిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, 'అహనా పెళ్లి అంటా' అంటూ డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి #celebrateSavitri ట్యాగ్‌చేసి మీ వీడియోలను ట్విట్టర్‌లో అప్‌లోడ్‌ చేయండి. 

samanta
Twitter
mahanati
  • Error fetching data: Network response was not ok

More Telugu News