vijaya sai: గ్రేటర్ విశాఖ పరిధిలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర

  • వచ్చేనెల 2వ తేదీ నుంచి గ్రేటర్ విశాఖ పరిధిలో పాదయాత్ర
  • విశాఖపట్నంలోని అగనంపూడిలో ప్రారంభం
  • వచ్చేనెల 12న భారీ బహిరంగ సభ

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చేనెల 2వ తేదీ నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జగన్‌కు సంఘీభావం తెలుపుతూ గ్రేటర్ విశాఖ పరిధిలో పాదయాత్ర జరపనున్నారు.

 విశాఖపట్నంలోని అగనంపూడిలో ప్రారంభం కానున్న ఆయన పాదయాత్ర పెందుర్తి, విశాఖ పశ్చిమ, ఉత్తర, తూర్పు నియోజకవర్గాల మీదుగా కొనసాగి దక్షిణ నియోజకవర్గానికి చేరుకోనుంది. పాదయాత్రలో భాగంగా ప్రభుత్వ తీరును తెలుపుతూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటారని ఆ పార్టీ నేతలు చెప్పారు. వచ్చేనెల 12న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

vijaya sai
YSRCP
jagan
  • Loading...

More Telugu News