KCR: ప్రత్యేక విమానంలో చెన్నైకి కేసీఆర్... వెంట హరీష్ రావు, ఈటల

  • తృతీయ కూటమి ఏర్పాటులో బిజీగా ఉన్న కేసీఆర్
  • చెన్నై బయలుదేరిన కేసీఆర్ బృందం
  • కరుణానిధి, స్టాలిన్ లతో చర్చలు

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమి ఏర్పాటులో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్, కొద్దిసేపటి క్రితం ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరి వెళ్లారు. కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ లతో పాటు ఎంపీలు కేకే, వినోద్ తదితరులు ఉన్నారు. 12:40 గంటల ప్రాంతంలో చెన్నై చేరుకునే ఆయన, విమానాశ్రయం నుంచి నేరుగా కరుణానిధి ఇంటికి వెళతారు. అక్కడాయన్ను పలకరించిన తరువాత డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తో భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్ పై చర్చిస్తారు. అనంతరం ఐటీసీ హోటల్ లో బసచేసే ఆయన, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలుస్తారు. రాత్రికి అక్కడే ఉండి, రేపు ఉదయం తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు. కాగా, పలువురు తమిళ సినీ ప్రముఖులు అక్కడ కేసీఆర్ ను కలవనున్నట్టు తెలుస్తోంది.

KCR
Stalin
Karunanidhi
Tamilnadu
Chennai
Harish Rao
Etela Rajender
  • Loading...

More Telugu News