Jagan: వైసీపీలో చేరిన కాటసాని... ఆహ్వానించిన జగన్

  • జగన్ సమక్షంలో చేరిక
  • భారీ కాన్వాయ్ తో వచ్చిన కాటసాని
  • వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచన

కర్నూలు జిల్లాలో పేరున్న నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ వద్దకు భారీ కాన్వాయ్ తో కాటసాని వచ్చారు. ఆపై కాటసానికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్.

కాటసానితో పాటు వచ్చిన వందలాది మంది ఆయన అనుచరులు కూడా వైకాపాలో చేరారు. కర్నూలు జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా జగన్ వారికి సూచించారు. కాటసాని మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న నిర్విరామ పోరాటాన్ని చూసి తాను స్ఫూర్తి పొందానని, ఇకపై ఆయన అడుగుజాడల్లో నడుస్తానని అన్నారు.

Jagan
Padayatra
Krishna District
Katasani
  • Loading...

More Telugu News